close

తాజా వార్తలు

వాళ్లే నన్ను బాగా ఇబ్బంది పెట్టారు: యువరాజ్‌

రికీ పాంటింగ్‌ ఆటతీరు బాగుంటుంది

ముంబయి: టీమిండియా ఆల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్ల పేర్లను వెల్లడించాడు. రెండు రోజుల క్రితమే అతను రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించిన ఆయనకు ఇద్దరు బౌలర్లను ఎదుర్కోవడం కష్టతరమైందని చెప్పాడు. అందులో ఒకరు శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ కాగా మరోకరు ఆసిస్‌ మాజీ పేసర్‌ గ్లెన్‌మెక్‌గ్రాత్‌  అని వెల్లడించాడు. 

విదేశీ ఆటగాళ్లలో అభిమానించే క్రికెటర్‌ పేరుని చెప్పమనగా కంగారూలకు రెండు ప్రపంచకప్‌లు అందించిన సూపర్‌ కెప్టెన్‌ రికీపాంటింగ్‌ అని బదులిచ్చాడు. పాంటింగ్‌ బ్యాటింగ్‌తో పాటు వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లతో ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని యువీ పేర్కొన్నాడు. మరోవైపు గతేడాదే ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలనుకున్నానని చెప్పాడు. అది కుదరకపోగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో తనకు మరిన్ని అవకాశాలు రాలేదని వాపోయాడు. జీవితంలో అనుకున్నవన్నీ జరగవని, ఈ ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడింటే ఇంకా సంతోషంగా రిటైరయ్యేవాడినని తెలిపాడు. 

ఈ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ విజేతగా నిలిచినా యువీ ఆడేందుకు నాలుగు మ్యాచ్‌ల్లోనే అవకాశం వచ్చింది. అందులో ఒకదానిలో అర్ధశతకం సాధించాడు. మొత్తంగా 132 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన ఈ సిక్సుల వీరుడు 129.71 స్ట్రైక్‌రేట్‌తో 2750 పరుగులు చేశాడు. ఇకపై తనకు విదేశాల్లో టీ20 లీగ్‌లు ఆడాలని ఉందని యువీ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.