Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000447
            [news_title_telugu_html] => 

20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ

[news_title_telugu] => 20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ [news_title_english] => boy kidnap lingten After 20years [news_short_description] => ఓ చోరీ కేసులో నిందితురాలిని విచారిస్తే రెండు దశాబ్దాల కిందట ఓ బాలుడిని అపహరించిన ఉదంతం బయటపడిన సంఘటన ఇది... [news_tags_keywords] => Vizianagaram,Crime,Boy,Woman [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 07:58:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ - boy kidnap lingten After 20years - EENADU
close

తాజా వార్తలు

20 ఏళ్లకు వెలుగులోకి బాలుడి అపహరణ

చోరీ కేసులో పట్టుబడి నిజం   వెల్లడించిన నిందితురాలు
ఫలించిన హెడ్‌ కానిస్టేబుల్‌ చాకచక్యం
  విజయనగరం జిల్లాలో ఘటన

విజయనగరం నేరవార్తా విభాగం: ఓ చోరీ కేసులో నిందితురాలిని విచారిస్తే రెండు దశాబ్దాల కిందట ఓ బాలుడిని అపహరించిన ఉదంతం బయటపడిన సంఘటన ఇది. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస పోలీసు స్టేషన్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ చాకచక్యంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ప్రాంతానికి చెందిన సుంకరి భాగ్యలక్ష్మి తొలి నుంచి దొంగతనాలే వృత్తిగా ఎంచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో ఉంటూ అప్పుడప్పుడు పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతోంది. ఇటీవల జియ్యమ్మవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చారు. అక్కడున్న ఆమె అతన్ని పరిచయం చేసుకుని అతని ఇంటికి వెళ్లింది. ఈ నెల 22న ఎవరూ లేని సమయంలో వ్యాపారి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పరారైంది. ఆమె బస్సులో ఉందని సమాచారం అందుకున్న గ్రామస్థులు ఆమెను పట్టుకొని పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. పోలీసు విచారణ సందర్భంగా 20 ఏళ్ల క్రితం ఓ బాలుడిని అపహరించినట్లు వెల్లడించింది.

బాలుడు సహా 25 తులాల బంగారం దోపిడీ
చీపురుపల్లి మండలం వంగపల్లిపేటలో 20 ఏళ్ల క్రితం భాగ్యలక్ష్మి ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న నాలుగేళ్ల బాబును, 25 తులాల బంగారు ఆభరణాలు, చీరలు, డబ్బులు ఎత్తుకుపోయింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది. అపహరణకు గురైన బాలుడు మండల సూర్యారావు, పెంటమ్మ దంపతులకు కుమారుడు. పేరు శంకరరావు. వీరు నివాసముంటున్న పక్కింట్లో నిందితురాలు అద్దెకు ఉండేది. అందరితో కలుపుగోలుగా ఉండటంతో ఆమెపై ఎవ్వరికీ అనుమానం రాలేదు.

లోతైన విచారణతో..
చీపురుపల్లి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన లోపింటి రామకృష్ణ ప్రస్తుతం జియ్యమ్మవలస హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అప్పట్లో బాలుడి అపహరణ కేసుపై ఆయన సుమారు మూడేళ్ల పాటు  తిరిగారు. తాజా కేసులో ఆయనకే భాగ్యలక్ష్మి పట్టుబడింది. లోతుగా విచారణ చేయడంతో గత చరిత్ర బయట పడింది. చీపురుపల్లిలో దొంగతనం, బాబు అపహరణ తానే చేశానని నిందితురాలు ఒప్పుకొంది. ప్రస్తుతం ఆ బాలుడు పెద్దయి రాజమహేంద్రవరంలో ఉన్నట్లు, ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో శంకరరావుతో సోదరి జ్యోతి మాట్లాడింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.