close

తాజా వార్తలు

మోగిన ‘అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ బెల్‌

సెప్టెంబరు 29 నుంచి ప్రారంభం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. 2019 సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌ విక్రేత సంస్థ అమెజాన్‌ తన ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్’ను ప్రకటించింది. సెప్టెంబరు 29 అర్ధరాత్రి నుంచి విక్రయదారులకు ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం ఉన్నవారికి మాత్రం సెప్టెంబరు 28 మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్ అందుబాటులో ఉండనుంది. అక్టోబరు 4న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సేల్‌ ముగియనుంది. 

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, గృహోపరణాలు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, ఇతర వస్తువలపై డిస్కౌంట్‌ను ‘అమెజాన్‌’ ప్రకటించనుంది. అంతేకాకుండా ఈ సేల్‌లో టాప్‌ బ్రాండ్స్‌కు చెందిన వస్తువులను ‘అమెజాన్’ వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఇందులో వన్‌ప్లస్‌, శ్యాంసంగ్‌, వన్‌ప్లస్‌టీవీ, అమెజాన్‌ బేసిక్స్‌, మ్యాగి, మరికొన్ని కంపెనీలకు చెందిన వస్తువులు ఉన్నాయి. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో షాపింగ్‌ చేసిన వారికి 10% డిస్కౌంట్‌ లభించనుంది.

పోటీ ఇవ్వనున్న ‘ఫ్లిప్‌కార్ట్‌’
మరో ఆన్‌లైన్‌ విక్రేత సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’కూడా తన బిగ్‌ బిలియన్స్‌ డేస్‌ సేల్‌ను సెప్టెంబరు 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. అక్టోబరు 4న ఈ సేల్‌ క్లోజ్‌ అవుతుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు ‘అమెజాన్‌’ కన్నా ముందే తన బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను ప్రకటించింది. దీంతో అతిపెద్ద ఆన్‌లైన్‌ విక్రేత సంస్థలైన ‘అమెజాన్’, ‘ఫ్లిప్‌కార్ట్‌’ మధ్య పోటీ ఉండనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.