close

తాజా వార్తలు

కన్నీళ్లు ఆపుకోలేకపోయా: ఆనంద్‌ మహీంద్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసక్తికర, హాస్యాస్పద, మానవీయ కథనాలను పోస్టు చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రాను ఓ చిన్నారి వీడియో కంటతడి పెట్టించింది. నిండా మూడేళ్లు కూడా ఉంటాయో లేదో పాపం పుట్టకతోనే చేతులు లేకుండా చేశాడా భగవంతుడు. అయినా నేను ఎందులోనూ తక్కువ కాదంటూ కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటున్నాడా చిన్నారి. చేతుల్లేకపోయినా పాదాలతో తింటున్న ఆ చిన్నారి వీడియోను చూసి ఆనంద్‌ మహీంద్రా కన్నీళ్లు ఆపుకోలేకపోయారట.

తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియో షేర్‌ చేస్తూ..  ‘ఈ మధ్యే నా మనవడ్ని చూసొచ్చా. అందుకే వాట్సాప్‌ పోస్టులో ఈ వీడియో చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఎలాంటి లోపాలు, సవాళ్లు ఉన్నాసరే.. జీవితం మనకో బహుమతి. దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. ఇలాంటి వీడియోలు చూసినప్పుడ్డు నాలో ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం మరింత పెరుగుతుంది’ అని ఆనంద్ మహీంద్రా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. 

ఈ వీడియోలో చిన్నారి మొదట పాదాలతో తినలేకపోయాడు. అయినప్పటికీ ఆగిపోకుండా మరోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. ఈ వీడియో ఆనంద్‌ మహీంద్రానే కాదు ఎంతోమంది నెటిజన్ల హృదయాలను కదలించింది. ఆ చిన్నారి జీవితం బాగుండాలంటూ నెటిజన్లు దీవిస్తున్నారు. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.