
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు ఇచ్చిన గడువు ముగిసిన కాసేపటికే మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీకి సమాచారమిచ్చారు. 24 గంటల గడువును నిర్దేశించారు.
తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా భాజపా (105)ను గవర్నర్ ఆహ్వానించగా.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఆ పార్టీ గవర్నర్‌కు తెలియజేసింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన (56)ను గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు బలాన్ని, సమ్మతిని తెలియజేయాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మరింత గడువు కోరగా.. అందుకు తిరస్కరించారు. మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీ (54)కి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (44), శివసేన సహకారం ఆ పార్టీకి తప్పనిసరి. మరి ఇప్పుడు ఎన్సీపీ ఏంచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
