close

తాజా వార్తలు

పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!

భోపాల్‌: వివాహాల పేరుతో దోపిడీలు చేస్తున్న దొంగల ముఠాను పట్టుకునేందుకు మధ్యప్రదేశ్‌ పోలీసులు సరికొత్త అవతారం ఎత్తారు. పెళ్లి కుమారుడి బంధువులుగా వెళ్లి.. నకిలీ వధువు ముఠాను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్‌ అనే మహిళ పెళ్లి సంబంధం పేరుతో తమ ఇంటికి వచ్చి బంగారు నగలు చోరీ చేసిందని ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ మహిళతో పాటు ఆమె గ్యాంగ్‌ను వెతకడం ప్రారంభించారు. అయితే తనిఖీలు ప్రారంభించిన పోలీసులకు ఆ మహిళ తరపు బృందం ఇదే తరహాలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇటీవల ఆ గ్యాంగ్‌ పెళ్లి పేరుతో మరో దోపిడీకి యత్నించారు. అయితే ఈ సారి అబ్బాయి తరఫున వారికి పరిచయమైంది మాత్రం పోలీసులు కావడం విశేషం. వరుడు కుటుంబసభ్యుల పేరుతో వారిని కలుద్దామని చెప్పి పోలీసులు పక్కాగా ప్రణాళిక ప్రకారం వారిని పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి మొత్తం బృందాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.