close

తాజా వార్తలు

విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల జరుగుతోన్న విధ్వంస చర్యలను పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఖండించారు. విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ బిల్లుపై ప్రజలు తమ నిరసనను శాంతి, ప్రజాస్వామ్యయుతంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేగానీ ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. రహదారులు, రైల్వే లైన్‌లను దిగ్బంధించి సామాన్య ప్రజలకు ఆటంకం సృష్టించొద్దని సూచిస్తూ శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. నిరసన పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దన్నారు. ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

పౌరసత్వ సవరణ చట్టం, అలాగే, దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్రం చెబుతోన్న జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దీదీ.. ఈ చట్టాలు తమ రాష్ట్రంలో అమలుకానీయమని పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ఎవరూ ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని కోరారు. పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమబెంగాల్‌లోని అనేక చోట్ల ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.