close

తాజా వార్తలు

‘ఇంకోసారి అలాంటి ట్వీట్లు చేస్తే లోపలేస్తాం’

భోపాల్‌: ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తి హిందువు కాదని వెనక్కి తిప్పి పంపిన వ్యక్తికి మధ్యప్రదేశ్‌ పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇంకోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు అతడికి నోటీసులు పంపారు. రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఈ తరహా ట్వీట్లు చేస్తే జైల్లో పెడతామని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలు రేకెత్తించే ఈ తరహా వ్యాఖ్యలు తగవని సూచించారు.

హిందూ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని పంపని కారణంగా మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌ శుక్లా జొమాటో ఆర్డర్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్‌ చేశాడు. దీనిపై జొమాటో సైతం ఘాటుగానే స్పందించింది. ఆహారానికి మతం ఉండదని బదులిచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా అసహనంపై చర్చకు దారితీసింది. పలువురు జొమాటో చర్యను సమర్థించగా.. మరికొందరు ఆ కంపెనీ రేటింగ్‌లు తగ్గించే చర్యలు చేపట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.