Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144998
            [news_title_telugu_html] => 

దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌

[news_title_telugu] => దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ [news_title_english] => high Alert in India [news_short_description] => ఆఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ నలుగురూ [news_tags_keywords] => India,HighAlert,Delhi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => zMdRiXRu-oY [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 10:26:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ - high Alert in India - EENADU
close

తాజా వార్తలు

దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి చొరబడినట్లు తమకు కీలక సమాచారం అందిందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురూ ఏసమయంలోనైనా విధ్వంసక చర్యలకు తెగబడే అవకాశముందని నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. ప్రధానంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రపై ఆ దుండగులు దృష్టి పెట్టినట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది.ఈ మేరకు గుజరాత్‌ యాంటీటెర్రరిస్ట్‌( ఏటీఎస్‌) బృందానికి సమాచారమందించింది. దుండగులకు సబంధించిన ఊహా చిత్రాలను కూడా గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు ఐబీ అందించింది.

నిజానికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజునే దాడులకు అవకాశమున్న నేపథ్యంలో దేశమంతా అప్రమత్తంగా ఉండటంతో దుండగులు ఎలాంటి చర్యలకు పాల్పడలేదని ఐబీ భావిస్తోంది. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండటంవల్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు అన్ని రాష్ట్రాలకు సమాచారమిచ్చాయి. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని కోరాయి. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.