close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌     కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు సోమవారం అదే మండలంలోని మరో ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లింది. అక్కడ పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ బట్టు వెంకటేశ్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చరవాణి నెంబరు ఇవ్వాలని వేధించాడు. ఆ సమయంలో ఎదురుతిరిగితే పరీక్షకు ఆటంకం కలుగుతుందని భావించిన విద్యార్థిని.. పరీక్ష అనంతరం తాను చదువుతున్న కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆరా తీసిన కళాశాల సిబ్బంది మంగళవారం ఇన్విజిలేటర్‌ వెంకటేశ్‌ను కళాశాలకు పిలిపించి నిలదీశారు. ‘‘నాకు ఆ అమ్మాయి నచ్చింది. అందుకే అలా చేశా’’ అని వెంకటేశ్‌ చెప్పడంతో ఆగ్రహించిన కళాశాల యాజమాన్యం, విద్యార్థులు అతడికి దేహశుద్ధి చేశారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్‌ను అరెస్ట్‌ చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.