close

తాజా వార్తలు

శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం

ముంబయి: ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్‌  బయలుదేరిన శ్రేయ .. తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఇందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఒప్పుకోలేదు. పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని చెప్పారు. దాంతో తప్పని పరిస్థితుల్లో శ్రేయ తన పరికరాన్ని విమానాశ్రయంలోనే వదిలేశారు.

ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ మ్యుజిషియన్స్‌ వద్ద విలువైన వాయిద్య పరికరాలుంటే విమానంలోకి ఎక్కనివ్వదేమో..! మంచిది. ధన్యవాదాలు. నాకు గుణపాఠం చెప్పారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ చూసిన ఎయిర్‌లైన్స్‌ సంస్థ శ్రేయకు క్షమాపణలు చెప్పింది.

‘శ్రేయా.. మీ పట్ల ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం. అసలేం జరిగిందో.. మా సిబ్బంది మీతో ఏమన్నారో కాస్త వివరంగా చెప్తారా?’ అని పేర్కొంది. ఈ ఘటనపై శ్రేయకు అభిమానుల నుంచి మద్దతు లభించింది. విషయం ఎంతో సీరియస్‌ అయితే కానీ ఆమె ఇలా ట్వీట్ చేయరంటూ ఎయిర్‌లైన్స్‌పై కామెంట్లు చేస్తున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.