close

ప్రధానాంశాలు

నడవాల పనుల్లో వేగం పెంచండి

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఉపరాష్ట్రపతి సూచన

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక నడవాల పనులు వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు సూచించారు. ఉపరాష్ట్రపతి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి, వాణిజ్య, భారీ పరిశ్రమలశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో విశాఖపట్నం-చిత్తూరు, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక నడవాల ప్రగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ప్రతిపాదిత ఫార్మాసిటీ పనులపై ఆరా తీశారు. కాకినాడలో ఏర్పాటు చేయదలచిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌(ఐఐపీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ)పైనా సమావేశంలో చర్చించారు. గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ఆ జిల్లాలో స్పైస్‌పార్క్‌ ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రికి సూచించారు. పునర్విభజన చట్టంలోని ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ఆయా పనులు వేగవంతమయ్యేలా చూస్తామని కేంద్ర మంత్రి, రెండు శాఖల కార్యదర్శులు ఉపరాష్ట్రపతికి తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.