
ప్రధానాంశాలు
దేశ రాజధాని వైపు ట్రాక్టర్లు
వాణిజ్య రాజధానికి అన్నదాతలు
నేడు ముంబయిలో భారీ బహిరంగ సభ
రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల పరేడ్‌లో రైతు శకటాలు
వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండుచేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించడానికి వివిధ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని వైపు భారీగా ట్రాక్టర్లు కదులుతున్నాయి. ఇంకోవైపు రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబయిలో సోమవారం భారీ ఊరేగింపు, బహిరంగ సభ జరగనున్నాయి. ఇందుకోసం నాసిక్ నుంచి రైతులు దండులా కదిలి వస్తున్నారు.
దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం ప్రశాంతంగా ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించడానికి రైతు సంఘాలు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు దేశ రాజధాని వైపు వస్తున్నాయి. రిపబ్లిక్ దినోత్సవంలో మాదిరిగా ఇక్కడ కూడా శకటాలను ప్రదర్శించనున్నారు. 30 శాతం ట్రాక్టర్లను ఇందుకు కేటాయించారు. వ్యవసాయ చట్టాలతో పాటు, వ్యవసాయం, పల్లె జీవితాలు, మహిళల పాత్ర, పశువుల పెంపకం తదితర అంశాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రైతుల ఆత్మహత్యలపై మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన పిల్లలు ఒక శకటాన్ని ప్రదర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల సభ్యులు కూడా పాల్గొననున్నారు.
రైతుల ఆందోళన కొనసాగుతున్న సింఘు, టిక్రి, ఘాజీపుర్, పల్వాల్, షాహజాన్పుర్ సరిహద్దుల నుంచి ఇవి బయలుదేరుతాయి. ప్రతి ట్రాక్టరుపైనా జాతీయ జెండా ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల తరువాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవుటర్ రింగ్ రోడ్డులో 100 కి.మీ. మేర ప్రయాణించాక సాయంత్రం ఆరింటికి ముగుస్తుంది. సమన్వయం కోసం ప్రతి సరిహద్దు కేంద్రం వద్ద 40 మందితో వార్ రూంలు ఏర్పాటయ్యాయి. ఇందులో వైద్యులు, భద్రతా బలగాల మాజీ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిర్వాహకులు ఉంటారు. అత్యవసర పరిస్థితుల కోసం 40 అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒక ట్రాక్టరుపై అయిదుగురికే అనుమతి ఇస్తారు. మెకానిక్కుల బృందం కూడా అందుబాటులో ఉంటుంది. ర్యాలీ ముగిసిన తరువాత తిరిగి దీక్షా స్థలాలకు చేరుకోనున్నారు. రైతుల పరేడ్‌లో పాల్గొనేందుకు పంజాబ్, హరియాణాల నుంచి భారీగా ట్రాక్టర్లు బయలుదేరాయి.
ర్యాలీ భగ్నానికి పాక్‌లో కుట్ర
ట్రాక్టర్ల ర్యాలీని విఫలం చేయడానికి పాక్‌లో కుట్ర జరుగుతున్నట్టు నిఘా విభాగం ప్రత్యేక పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు. ఈ నెల 13 నుంచి 18 మధ్య అక్కడ 300కుపైగా ట్విటర్ ఖాతాలు ప్రారంభించింది. ర్యాలీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- రివ్యూ: చెక్
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- డిపాజిట్..నెలనెలా వెనక్కి...
- నేడు భారత్ బంద్
- ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. ఇదే ఒప్పుకుంటారు..
- ఈ భామలు.. ఒక్క డైలాగ్‌తో కిక్కెక్కించారు
- కోడలిపై మామ లైంగిక దాడి
- పెళ్లిపై స్పందించిన విశాల్