చిన్న పరిశ్రమలకు చేయూత
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న పరిశ్రమలకు చేయూత

రూ.500 కోట్ల రుణాలివ్వాలని రాష్ట్ర ఆర్థిక సంస్థ నిర్ణయం
జనవరి నుంచి రూ.76.13 కోట్లు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా సమయంలో తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ఆర్థిక సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆదేశాల మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల మేరకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.76.13 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అందులో ఇప్పటికే రూ.70.12 కోట్లు విడుదల చేసింది. కరోనా సమయంలో తమకు అండగా నిలవాలని గత జనవరిలో పారిశ్రామికవేత్తలు కేటీఆర్‌ను కోరారు. ఆయన సమీక్ష నిర్వహించి, వారికి రుణసాయం భారీగా పెంచాలని ఆదేశించారు. ఈ మేరకు సంస్థ జనవరి నుంచి సాయం పెంచింది.
రూ.12.60 కోట్ల లాభం
‘2020-21 ఆర్థిక సంవత్సరంలో మా సంస్థ రూ.454.64 కోట్ల ఆదాయాన్ని పొందింది. రూ.12.60 కోట్ల లాభాన్ని నమోదు చేసింది’ అని రాష్ట్ర ఆర్థిక సంస్థ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. రుణాలు అందించడంతో పాటు రికవరీపైనా దృష్టి సారిస్తామని, తిరిగి చెల్లించిన వారికి మళ్లీమళ్లీ రుణాలు అందిస్తామని వెల్లడించారు.
టిఫ్‌ కృతజ్ఞతలు
కరోనా సమయంలో పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ఆర్థిక సంస్థ రుణాలు అందించడంపై తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్‌ ఫెడరేషన్‌- టిఫ్‌) అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం సమస్య ఉందని, కేటీఆర్‌ చొరవచూపడంతో ఎస్‌ఎఫ్‌సీ ద్వారా పారిశ్రామికవేత్తలకు సత్వర రుణం అందుతోందని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు