దీపావళి వరకు ప్రతి నెలా పది కిలోల బియ్యం

ప్రధానాంశాలు

దీపావళి వరకు ప్రతి నెలా పది కిలోల బియ్యం

  ఎల్లుండి నుంచి కార్డుదారులకు పంపిణీ

  పౌరసరఫరాల మంత్రి గంగుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా  ఇచ్చిన వాటితోపాటు 90.50 లక్షల రేషన్‌కార్డుదారులకు ఆగస్టు నుంచి దీపావళి వరకు పది కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌  పేర్కొన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చిన అయిదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మరో అయిదు కిలోలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 3.09 నూతన కార్డులను జారీ చేసింది. వారికీ ఆగస్టు నుంచి ఒక్కో కుటుంబ సభ్యునకు పది కిలోల చొప్పున బియ్యం ఇస్తామని మంత్రి ప్రకటించారు. ‘అదనపు కోటాతో ప్రభుత్వంపై నెలకు రూ.23.10 కోట్ల భారం పడుతుంది. కరోనా నేపథ్యంలో దీపావళి వరకు అయిదు కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం జూన్‌ 24న ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక సమాచారం ఆలస్యంగా రావటంతో జులైలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలే ఇచ్చాం. ఆగస్టు కోటా పది కిలోలతో పాటు జులై నెల ఇవ్వాల్సిన అయిదు కిలోలు కూడా కలిపి 15 కిలోల బియ్యం పాత కార్డుదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించామ’ని ఆయన తెలిపారు. ఆగస్టు నెల కోటా బియ్యాన్ని మంగళవారం నుంచి పంపిణీని చేపట్టనున్నట్లు మంత్రి గంగుల ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని