Black Fungus: దేశంలో 11,717 ఫంగల్ కేసులు 

తాజా వార్తలు

Published : 26/05/2021 16:06 IST

Black Fungus: దేశంలో 11,717 ఫంగల్ కేసులు 

గుజరాత్‌లోనే అత్యధికం

దిల్లీ: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌ను..మ్యుకర్ మైకోసిస్‌(బ్లాక్‌ ఫంగస్) కేసులు కలవరపెడుతున్నాయి. బుధవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 11,717 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది. 

గుజరాత్‌లో అత్యధికంగా 2,859 కేసులు ఉండగా, మహారాష్ట్రలో 2,770, ఆంధ్రప్రదేశ్‌లో 768 మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయా రాష్ట్రాల వారీగా కేసుల వివరాలను కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అలాగే చికిత్స నిమిత్తం అదనంగా మరో 29,250 ఆంఫోటెరిసిన్-బి వయల్స్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిపారు. 

కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్ ముప్పుగా పరిణమించింది. ఇదేమీ కొత్తవ్యాధి కాకపోయినా.. దీనిబారిన పడినవారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ ఫంగల్ వ్యాధిని తిప్పికొడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు దీని బారినపడే అవకాశం ఎక్కువ. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్ యాక్ట్‌) కింద పరిగణించాలని కేంద్రం కొద్దిరోజుల క్రితం రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించాయి.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని