మహారాష్ట్రలో కరోనా మృత్యునాదం 

తాజా వార్తలు

Published : 23/04/2021 22:09 IST

మహారాష్ట్రలో కరోనా మృత్యునాదం 

ఒక్కరోజే 773 మంది మృతి

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 773 మందిని ఈ వైరస్‌ బలితీసుకుంది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 66,836 కొత్త కేసులు వెలుగు చూశాయి. అనేక వారాల తర్వాత తొలిసారి కొత్త కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. శుక్రవారం ఒక్కరోజే 74,045 మంది రోగులు కోలుకోవడంతో ఇప్పటివరకు ఈ వైరస్‌బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 34,04,792కి పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలో రివకరీ రేటు 81.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.52 శాతంగా ఉంది.

మహారాష్ట్రలో ప్రస్తుతం 6,91,851 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో పుణెలో అత్యధికంగా 9,863 కొత్త కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. ముంబయి కన్నా నాగ్‌పుర్‌లో ఈ రోజు అత్యధిక కేసులు నమోదయ్యాయి. ముంబయిలో 7,221 కొత్త కేసులు రాగా.. నాగ్‌పూర్‌లో 7,970 కొత్త కేసులు వెలుగుచూశాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని