close

తాజా వార్తలు

Updated : 26/11/2020 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతుల ఆందోళన: దిల్లీ సరిహద్దుల మూసివేత

దిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలో పలుచోట్ల ఉద్యమిస్తున్న లక్షలాది మంది రైతులు దేశ రాజధాని దిశగా కదం తొక్కారు. ‘చలో దిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చిన రైతులు గురువారం జంతర్‌మంతర్‌ వద్ద భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. హింసాత్మక ఘటనలు నిలువరించేందుకు రాజధాని సరిహద్దులను మూసివేశారు. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌లోని సరిహద్దుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ దృష్ట్యా దిల్లీలో ఎలాంటి ర్యాలీలను ప్రభుత్వం అనుమతించలేదు. అటు దిల్లీ మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. 

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో 26, 27 తేదీల్లో ఆందోళన చేపట్టేందుకు యూపీ, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పంజాబ్‌ రైతులు ‘చలో దిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే, కరోనా దృష్ట్యా వీరి ర్యాలీకి దిల్లీ పోలీసులు తిరస్కరించారు. అయినప్పటికీ రైతులు దిల్లీ దిశగా బయల్దేరడంతో పోలీసులు సరిహద్దులు మూసివేశారు. దిల్లీ-జమ్మూ హైవేపై కూడా పోలీసులు భారీగా మోహరించారు. Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన