విదేశాలనుంచి వచ్చిన అందరికీ ‘జీనోమ్‌’

తాజా వార్తలు

Published : 29/12/2020 17:23 IST

విదేశాలనుంచి వచ్చిన అందరికీ ‘జీనోమ్‌’

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: భారత్‌లో కరోనా కొత్త రకం కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే డిసెంబరు 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారందరికీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిర్వహించనుంది. కొత్త రకం వైరస్‌లను నిర్ధారించడంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. 

‘విదేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో కరోనా కొత్త రకం వైరస్‌ బయటపడింది. కరోనాతో పోలిస్తే యూకే స్ట్రెయిన్‌ వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో యూకే స్ట్రెయిన్‌ సహా కొత్తరకం వైరస్‌లను గుర్తించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డిసెంబరు 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారందరికీ జీనోమ్‌ పరీక్షలు చేయనున్నాం. ఇందుకోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్‌ రాకముందే దాదాపు 5వేల జీనోమ్‌ పరీక్షలు చేశాం. ఈ సంఖ్యను క్రమంగా పెంచుతాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

వ్యాక్సిన్లు పనిచేస్తాయి..

అయితే కొత్త రకంపైనా వ్యాక్సిన్లు పనిచేస్తాయని కేంద్ర సాంకేతిక సలహాదారు విజయ్‌ రాఘవన్‌ తెలిపారు. స్ట్రెయిన్‌పై టీకాలు పనిచేయవని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. 

భారత్‌లోనూ రూపాంతరం చెందొచ్చు..

కాగా.. భారత్‌లోనూ కరోనా వైరస్‌ జన్యుమార్పిడి మరో కొత్త రకం బయటపడొచ్చని నీతిఆయోగ్‌ సభ్యులు డాక్టర్ వీకే పాల్‌ హెచ్చరించారు. యూకేలో వెలుగుచూసిన కొత్తరకం ఇప్పటికే భారత్‌ సహా అనేక దేశాలకు పాకిందని, ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత చలి పరిస్థితుల దృష్ట్యా మరింత ఎక్కువ మంది కొవిడ్‌ బారిన పడే ప్రమాదముందని అన్నారు.

ఇవీ చదవండి..

మరికొంతకాలం బ్రిటన్‌కు విమానాల రద్దు

భారత్‌లోకి కరోనా కొత్తరకం 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని