అర్ణబ్‌ ఆరోగ్యంపై మహా గవర్నర్‌ ఆందోళన

తాజా వార్తలు

Published : 09/11/2020 21:23 IST

అర్ణబ్‌ ఆరోగ్యంపై మహా గవర్నర్‌ ఆందోళన

ముంబయి: జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామి భద్రత, ఆరోగ్యంపై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌తో మాట్లాడిన గవర్నర్‌ కోశ్యారీ.. అర్ణబ్‌ తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. అర్ణబ్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. 

ఆర్కిటెక్ట్‌ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలతో నవంబరు 4న అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయనను జైలు క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. అయితే అక్కడ అర్ణబ్‌ మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నట్లు సమాచారం రావడంతో ఆయనను తలోజా జైలుకు తరలించారు. జైలుకు తరలిస్తున్న సమయంలో తన ప్రాణానికి ముప్పు ఉందని ఆయన గట్టిగా అరిచినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పలు మీడియాల్లో కథనాలు రావడంతో గవర్నర్‌ హోంమంత్రితో మాట్లాడారు. మరోవైపు తన అరెస్టును సవాల్‌ చేస్తూ అర్ణబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని