
తాజా వార్తలు
ఒడిశాలో లాక్డౌన్ పొడిగింపు
భువనేశ్వర్: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రం నిర్ణయం వెలువడకముందే ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజల ప్రాణాలు.. ఆర్థిక స్థిరత్వం కంటే ముఖ్యమైనవని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని కూడా కోరినట్టు నవీన్ పట్నాయక్ తెలిపారు. ఒడిశాలో విద్యా సంస్థలకు జూన్ 17 వరకు సెలవులు ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్డౌన్ కొనసాగింపు నిర్ణయాన్ని ఒడిశా ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం.