
తాజా వార్తలు
ఆరోపణలను తోసిపుచ్చిన సీరం ఇన్స్టిట్యూట్!
పుణె: క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తాను అనారోగ్యానికి గురైనట్లు ఓ వాలంటీర్ ఆరోపిస్తూ సీరమ్ ఇన్స్టిట్యూట్కు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహిస్తోన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) స్పందించింది. వ్యాక్సిన్ ప్రయోగాలపై సదరు వ్యక్తి చేసిన ఆరోపణలను తోసిపుచ్చన ఎస్ఐఐ, ఇలాంటి తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
చెన్నైకి చెందిన 40ఏళ్ల వ్యక్తి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తనకు నాడీ సంబంధమైన సమస్యలతో పాటు ఇతర దుష్ర్పభావాలు ఎదురైనట్లు ఆరోపించాడు. దీంతో ప్రయోగాలను వెంటనే నిలిపివేయడంతో పాటు తనకు రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలని సీరమ్ ఇన్స్టిట్యూట్కు నోటీసులు పంపించడంపై ఆ సంస్థ స్పందించింది.
‘నోటీసుల్లో పేర్కొన్న అంశాలు ద్వేషపూరితంగా, తప్పుగా అర్థం చేసుకున్నట్లు ఉన్నాయి. అయితే, వాలంటీర్ ఆరోగ్యస్థితిపై సానుభూతితో ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ ప్రయోగాలకు, ఆయన ఆరోగ్య సమస్యకు ఎటువంటి సంబంధం లేదు’ అని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కేవలం ఆయన ఆరోగ్య సమస్యలను వ్యాక్సిన్ ప్రయోగాలకు ఆపాదిస్తూ నిందలు వేస్తున్నాడని తెలిపింది. డబ్బు డిమాండ్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. దీనిపై రూ.100కోట్లకు పైగా నష్టపరిహారాన్ని కోరడంతో పాటు ఇలాంటి అసత్య వాదనల నుండి కాపాడుకుంటామని సీరమ్ ఇన్స్టిట్యూట్ స్పష్టంచేసింది.
ఇదిలా ఉంటే, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ, భారత్‌లో ప్రయోగాలను పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రయోగాలు పూర్తి చేసుకుంటుండగా, మరో రెండు వారాల్లోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అధర్ పూనావాలా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ, ప్రయోగ వివరాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించారు.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్ వికటించింది..రూ.5కోట్లివ్వండి..!
మోదీ రాక: వ్యాక్సిన్ శాస్త్రవేత్తల్లో జోష్
ఆక్స్ఫర్డ్ టీకా: 70శాతం సమర్థత
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
