బుల్లెట్ రైలుకు శివసేన షాక్‌..! 

తాజా వార్తలు

Published : 25/12/2020 01:36 IST

బుల్లెట్ రైలుకు శివసేన షాక్‌..! 

భూ బదలాయింపు ప్రతిపాదనకు తిరస్కరణ

థానే: అహ్మదాబాద్‌- ముంబయి బుల్లెట్‌ రైలుకు అవాంతరం ఎదురైంది. థానే జిల్లా పరిధిలోని భూమిని ఈ రైలు ప్రాజెక్ట్‌కు బదలాయించేందుకు ఆ పార్టీ నేతృత్వంలోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (టీఎంసీ) తిరస్కరించింది. ముంబయి మెట్రో కార్‌ షెడ్‌  విషయంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

థానే జిల్లాలోని షిల్‌- దాయ్‌ఘర్‌ ప్రాంతంలో 3,800 చదరపు మీటర్ల భూమిని బదలాయించాలన్న నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) ప్రతిపాదనను టీఎంసీ పాలక మండలి తోసిపుచ్చింది. గతంలో నాలుగుసార్లు ఇదే అంశం చర్చకు వచ్చినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని పాలక మండలి.. తాజాగా జరిగిన సమావేశంలో తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ముంబయిలోని ఆరే కాలనీలో ఉన్న మెట్రో కార్‌ షెడ్‌ను కంజూర్‌ మార్గ్‌కు తరలించచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. అది కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారమని, రాష్ట్రంతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో భూకేటాయింపుపై హైకోర్టు స్టే విధించింది. గతంలో పర్యావరణవేత్తలు వ్యతిరేకించినప్పటికీ అప్పటి భాజపా ప్రభుత్వం కార్‌షెడ్‌ను ఏర్పాటుకు ఆరే కాలనీనే ఎంచుకుంది. దాన్ని ప్రస్తుత శివసేన ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కార్‌షెడ్‌ను తరలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర- రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని