Phone blast : న్యాయవాది జేబులో పేలిన ఫోన్‌

తాజా వార్తలు

Updated : 15/09/2021 06:12 IST

Phone blast : న్యాయవాది జేబులో పేలిన ఫోన్‌

కోర్టులో విచారణ జరుగుతుండగా ఘటన

దిల్లీ: దిల్లీకి చెందిన న్యాయవాది గౌరవ్‌ గులాటి.. తాను కొత్తగా కొనుగోలు చేసిన వన్‌ప్లస్‌ నార్డ్‌-2 స్మార్ట్‌ఫోన్‌ జేబులోనే పేలిపోయిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో ఉంచారు. ఫోన్‌ పేలిన సమయంలో 90 శాతం ఛార్జింగ్‌ ఉందని, ఆ సమయంలో దాన్ని ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. ముందుగా ఫోన్‌ నుంచి మంట వచ్చిందని, ఆ తర్వాత క్షణాల్లోనే పేలిపోయిందన్నారు. తనకు గాయాలు కూడా అయ్యాయని, కోర్టు గదిలోనే ఇదంతా జరిగిందని చెప్పారు. ఫోన్‌ పేలిపోయిన ఘటనకు సంబంధించిన సంస్థను సంప్రదించబోనని, నేరుగా న్యాయపోరాటం చేస్తానని గౌరవ్‌ స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై వన్‌ ప్లస్‌ సంస్థ స్పందించింది. ఫోన్‌ను పరీక్షించి విచారించకుండా పరిహారం చెల్లించలేమని పేర్కొంది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు యజమానిని సంప్రదిస్తే ఆయన నుంచి స్పందన లేదని తెలిపింది. బీ వన్‌ ప్లస్‌ నార్డ్‌-2 ఫోన్‌ నుంచి మంటలు రావడం ఇదే తొలిసారి కాదు. ఆగస్టు మొదటి వారంలోనే ఈ మోడల్‌ ఫోన్‌ ఒకటి కాలిపోయింది. అప్పుడు ఇతర కారణాల వల్ల (తయారీ సంస్థతో సంబం ధం లేని) ఫోన్‌ పేలినట్లు వన్‌ప్లస్‌ వివరణ ఇచ్చింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని