అమెరికాలో ఉత్కంఠగా కొనసాగుతున్న పోలింగ్‌

తాజా వార్తలు

Updated : 03/11/2020 23:51 IST

అమెరికాలో ఉత్కంఠగా కొనసాగుతున్న పోలింగ్‌

ఫ్లోరిడాలో ఓటు వేసిన మెలానియా

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న  ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా కొనసాగుతోంది. న్యూహాంప్‌షైర్‌లోని రెండు చిన్న ఆవాసాల్లో తొలుత పోలింగ్ ప్రారంభం కాగా.. అధికారులు అక్కడ కౌంటింగ్‌ను సైతం పూర్తి చేశారు. ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఫ్లోరిడా రిసార్ట్‌ సమీపంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

మరోవైపు, కనెక్టికట్‌, ఇండియానా, కెంటకీ, మెయిన్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, వర్జీనియా రాష్ట్రాల్లో  భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. డెలావేర్‌,  డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా,  ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్‌, లూసియానా, మిషిగన్‌, మిస్సోరి, పెన్సిల్వేనియా, రోడ్‌ఐలండ్‌, సౌత్‌ కరోలినా రాష్ట్రాల్లో 5.30గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా..   కొలరాడో, మాంటానా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వయోమింగ్ రాష్ట్రాల్లో రాత్రి 7.30గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. రాత్రి 8.30 గంటలకు కాలిఫోర్నియా, హైడహో, నెవాడా రాష్ట్రాల్లో ప్రారంభమైంది. 

అమెరికా తలరాతను నిర్ణయించే ఎన్నికలు కావడంతో పెన్సిల్వేనియా, నిస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. పెరుగుతున్న పోలింగ్‌ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అమెరికాలో మొత్తంగా 23.9 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా..  ఇప్పటికే దాదాపు 10కోట్లమంది అమెరికన్లు ముందస్తు ఓటు వేశారు. మరో ఆరు కోట్ల మంది వరకు ఈ రోజు ఓటు వేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఎక్కువగానే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వేసిన ముందస్తు ఓట్లు 2016 ఎన్నికలను మించిపోయాయి. హవాయి, టెక్సాస్‌, మాంటానా రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా పోలింగ్‌ నమోదైంది. అయితే, ట్రంప్‌, బైడెన్‌ ఇద్దరూ ఈ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు.

ఇవీ చదవండి..

అమెరికా ప్రీ-పోల్స్‌ ఏమంటున్నాయి?

ట్రంప్‌, బైడెన్‌: ఇందులోనూ భిన్న ధృవాలే 

బైడెన్‌ గెలిస్తే.. కమలనే అధ్యక్షురాలు

ఎన్నికల వేళ.. అప్రమత్తమైన న్యూయార్క్‌..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని