టీకా పర్యాటకం: వీవీఐపీలకు వ్యాక్సిన్‌ ఆఫర్‌!

తాజా వార్తలు

Published : 24/11/2020 23:03 IST

టీకా పర్యాటకం: వీవీఐపీలకు వ్యాక్సిన్‌ ఆఫర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక వస్తువు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అది మార్కెట్లోకి విడుదల అవుతుందా అని ఆరాట పడుతున్నారు. ఆ వస్తువేంటో? అదెంత ముఖ్యమో? మీకూ తెలుసు! అదేనండి కరోనా వైరస్‌కు టీకా.

విపణిలోకి వ్యాక్సిన్‌ ఇంకా విడుదలే అవ్వలేదు అప్పుడే ‘టీకా పర్యాటకం’ (వ్యాక్సిన్‌ టూరిజం) మొదలైందని తెలుస్తోంది. భారతదేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు పర్యాటక సంస్థల నుంచి సందేశాలు వచ్చాయని సమాచారం. అమెరికాలో వారం రోజుల పర్యటనతో పాటు కరోనా టీకాను వేయించడమే దీని సారాంశం.

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచమంతా పాకేసింది. అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలను, ఇటు అభివృద్ధి చెందుతున్న దేశాలనూ అల్లకల్లోలం చేసేస్తోంది. ఈ విపత్తు నుంచి మానవ జాతికి విముక్తి కలిగించేందుకు అనేక దేశాల్లో వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నారు. ఫైజర్‌, మోడెర్నా టీకాలు 90% సమర్థంగా పనిచేస్తున్నాయని నివేదికలు వస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా టీకా సైతం మూడో దశ ట్రయల్స్‌లో 70% సమర్థత చూపించిందని తెలిసింది. ఏ వ్యాక్సిన్‌కు 100% విజయాల రేటింగ్‌ రానప్పటికీ డిసెంబర్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వస్తుందన్న అంచనాలు మాత్రం ఉన్నాయి.

ఇదే అదనుగా కొన్ని ట్రావెల్‌ కంపెనీలు ‘టీకా పర్యాటకం’కు సిద్ధమయ్యాయి! ఇన్నాళ్లు నష్టపోయిన వ్యాపారాలను తిరిగి గాడిన పెట్టేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. ‘కరోనా వ్యాక్సిన్‌ను మొదట పొందిన వ్యక్తిగా నిలవండి. అమెరికాలో (బహుశా డిసెంబర్‌11) ఫైజర్‌ టీకా విడుదల అవ్వగానే ఎంపిక చేసిన కొద్దిమంది మా వీవీఐపీ క్లయింట్లకు వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ధర రూ.1,74,999. ఇందులోనే ముంబయి-న్యూయార్క్‌-ముంబయి విమాన టికెట్ల ధర, 3 రాత్రులు/4 పగళ్లు బస, భోజనం, వ్యాక్సిన్‌, జీఎస్‌టీ కలుస్తాయి’ అని ఓ సంస్థ నుంచి భారత్‌లోని కొందరికి సందేశాలు వచ్చాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని