చైనాలో 5మాసాల తర్వాత అత్యధిక కేసులు!

తాజా వార్తలు

Published : 11/01/2021 20:06 IST

చైనాలో 5మాసాల తర్వాత అత్యధిక కేసులు!

బీజింగ్‌: కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనాలో దాదాపు ఐదు నెలల తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 103 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో చివరిగా గతేడాది జులై 30న అత్యధికంగా 127 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం చైనాలోని పలు ప్రావిన్సుల్లో కొత్తగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుండటంతో అధికారులు వేగంగా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హీలోంగ్జియాంగ్‌ ప్రావిన్సులో కొత్తగా కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడంతో సోమవారం లాక్‌డౌన్‌ విధించినట్లు సమాచారం. 

మరోవైపు దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మొత్తం కేసుల్లో అధిక శాతం హెబీ ప్రావిన్సులో ఉంటున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ రోజు నిర్దారించిన మొత్తం 103 కేసుల్లో హెబీ ప్రావిన్సులో నమోదైన 82 కేసులు ఉన్నాయని పేర్కొంది. లియోనింగ్‌ ప్రావిన్సులో రెండు, బీజింగ్‌లో ఒకటి చొప్పున నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. హెబీ ప్రావిన్సులో కేసుల ప్రభావం ఎక్కువగా ఉంటుండటంతో ఆ ప్రావిన్స్‌ నుంచి దేశ రాజధాని బీజింగ్‌కు మధ్య రవాణా సౌకర్యాలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. కాగా చైనాలో ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య.. గతేడాది కొవిడ్‌ ఆరంభంలో నమోదైన కేసులతో పోలిస్తే తక్కువే. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం వేగంగా నివారణ చర్యలు చేపడుతుండటం గమనార్హం. చైనాలో ఇప్పటి వరకు 87,536 కరోనా కేసులు నమోదు కాగా...4,634 మంది వ్యాధి కారణంగా మరణించారు. మరోవైపు కరోనా పుట్టుకకు సంబంధించి విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం గత వారం చైనాకు చేరుకున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

డ్రా.. కానే కాదిది.. ఆసిస్‌ పొగరుకు ఓటమి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని