కడు పేదలు ఇక్కడ లేరు..!
close

తాజా వార్తలు

Updated : 25/02/2021 15:51 IST

కడు పేదలు ఇక్కడ లేరు..!

* షీ జిన్‌పింగ్‌ ప్రకటన

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మరో ఘనత సాధించినట్లు ప్రకటించింది. తమ దేశంలో కడు పేదలు ఎవరూ లేరని అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. పేదరికంపై సంపూర్ణ విజయం సాధించినట్లు ఆయన బీజింగ్‌లో ఘనంగా ప్రకటించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశం విజయం సాధించడానికి కృషి చేసిన 1,981 మందికి, 1,501 సంస్థలకు ఆయన రిప్రజెంటేటీవ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హానరీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అవతరించి మరో నాలుగు నెలల్లో వందేళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకొంది. ‘మానవ చరిత్రలోనే ఇదొక అద్భుతం’ అని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.  ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం 832 కౌంటీలను, 1,28,000 గ్రామాలను , దాదాపు 10 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది.

చైనా దృష్టిలో పేదరికం అంటే ఏమిటీ..?

రోజువారీ ఆదాయం 2.30డాలర్ల కంటే తక్కువ ఉన్న వారిని చైనాలో దారిద్యరేఖకు కింద ఉన్నట్లు భావిస్తారు. ఇది పేద దేశాలకు ప్రపంచ  బ్యాంక్‌ సూచించిన 1.90 డాలర్ల రోజువారీ ఆదాయం కంటే కొంచెం ఎక్కువ. కానీ, అత్యధిక ఆదాయం ఉన్న దేశాలకు  ప్రపంచ బ్యాంక్‌ నిర్దేశించిన రోజువారీ ఆదాయ ప్రామాణిక మొత్తం 5.50 డాలర్ల  కంటే ఇది చాలా తక్కువ. చైనాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వాస్తవానికి చైనాలో పేదరిక నిర్మూలన ఉద్యమంలో వేలకొద్దీ అక్రమాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. అధికారులే వారి చుట్టాలను, బంధువులను పేదలుగా ప్రభుత్వ నిధులను మళ్లించడం అక్కడ సర్వసాధారణమని యునివర్శిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆంట్రియో ప్రొఫెసర్‌ టెర్రీ పేర్కొన్నారు. దీనికి తోడు దారిద్యరేఖ ప్రామాణిక మొత్తం జాతీయ ఆదాయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటికీ చైనాలో 13శాతం మంది పేదరికంలో ఉండే అవకాశం ఉందని టెర్రీ వివరించారు.

మరి సాధించింది ఏంటి?

పేదరికం లెక్కలు వేయడానికి చైనా అధికారులు ఇంటింటికీ తిరిగి ఆదాయం, ఇంటి పరిస్థితులు, ఆరోగ్యబీమా, పాఠశాల మానేసిన వారిని గుర్తించి.. మెరుగుపర్చారు. ఇప్పుడు చైనాలో ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాల్సిందేనని సౌత్‌చైనా మార్నింగ్‌పోస్టు పేర్కొంది. దీంతోపాటు శిశుమరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు ఇటీవల ఐరాస పేర్కొంది. చైనాలో 1970లో ఆర్థిక  సంస్కరణలు చేపట్టారు. నాటి నుంచి 800 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటవేసినట్లు ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని