25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..!

తాజా వార్తలు

Updated : 27/02/2021 21:08 IST

25కి.మీ. రోడ్డు.. 18 గంటల్లో పూర్తి..!

కర్ణాటక: అతివేగంగా నిర్మించిన ఓ జాతీయ రహదారికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం దక్కింది. కర్ణాటకలోని చొల్లాపూర్‌, విజయ్‌పూర్‌ల మధ్య 25.54 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులను కేవలం 18 గంటల్లోనే పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించారు. అంతకు ముందు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఈ రోడ్డు పనులను ప్రారంభించారు. అతివేగంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించడంపై నితిన్‌ గడ్కరీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కరా జోలాని ప్రశంసించారు. అటు నిర్మాణ పనుల్లో పాల్గొన్న బృందాన్ని అధికారులు అభినందించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని