Corona: వెంటనే మూడోదశ వస్తే.. కష్టమే!
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 15:42 IST

Corona: వెంటనే మూడోదశ వస్తే.. కష్టమే!

కేరళలో రెండో దశలో డెల్టా వేరియంట్ విస్తృత వ్యాప్తి

తిరువనంతపురం: కరోనా వైరస్ రెండో దశలో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. అయితే ప్రస్తుతం కేరళలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

‘ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య తగ్గుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు లాక్‌డౌన్ ఆంక్షలు పనిచేశాయి. మరణాల విషయంలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. కేరళ మెరుగైన పనితీరు చూపింది. అయితే పూర్తి స్థాయిలో ఆంక్షల సడలింపునకు పరిస్థితులు అనుకూలంగా లేవు. గత మూడురోజులుగా సగటు పాజిటివిటీరేటు 13.9 శాతంగా నమోదవుతోంది. దాన్ని 10శాతం దిగువకు తీసుకురావడమే లక్ష్యం. ఇంటా బయటా ప్రజలు కచ్చితంగా కొవిడ్ ఆంక్షలను పాటించాలి’ అని విజయన్ సూచించారు. అలాగే రాష్ట్రంలో 6.61శాతం మంది రెండు డోసులు పొందగా.. 25శాతం మందికిపైగా మొదటి డోసును స్వీకరించారని వివరించారు.

ఇప్పటికే కరోనా రెండోదశ తీవ్రరూపం దాల్చగా.. వెంటనే మూడోదశ దాడి చేస్తే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మరో దఫా వైరస్ విజృంభిస్తే ..భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత ప్రజలు నిబంధనలు పాటించాలి. ఈ సమయంలో మరిన్ని వైద్యసదుపాయాలను సమకూర్చనున్నాం’ అని వివరించారు. అలాగే మూడో దశ పిల్లలపై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో వ్యాధి నివారణకు విస్తృతమై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేరళలో 24 గంటల వ్యవధిలో 14,233 మందికి కరోనా సోకగా..173 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా 27లక్షల మందికి కరోనా సోకగా..10వేలకు మందికిపైగా బలయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని