కూతురి ఆజ్ఞను శిరసావహించిన కేంద్రమంత్రి

తాజా వార్తలు

Published : 12/02/2020 00:46 IST

కూతురి ఆజ్ఞను శిరసావహించిన కేంద్రమంత్రి

తన కూతురికి నచ్చిన వంటకాలు చేసిపెట్టిన స్మృతీ ఇరానీ 


దిల్లీ: కూతురు ఆజ్ఞ చేసిందే తరువాయి.. నో అని చెప్పకుండా క్షణాల్లో  కోరుకున్నది చేసి పెట్టింది ఆ తల్లి. ఇలా చేసింది సాదాసీదా మహిళ అయితే సరే అనుకోవచ్చు.. కానీ ఆ ఆజ్ఞ పాటించింది కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. పార్లమెంటులో తన ప్రసంగాలతో అందర్నీ ఆకర్షించే స్మృతీ ఇరానీ..కేంద్రమంత్రిగా తన బాధ్యతలతోపాటు..తల్లి బాధ్యతలు కూడా క్రమం తప్పకుండా నిర్వర్తిస్తోంది. తాజాగా తన కూతురికోసం చేసిన పనితో ఇది స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే స్మృతీ ఇరానీ, తాను చేసే వంటలను తరచుగా తన అభిమానులతో పంచుకుంటుంది కూడా. అయితే ఈ సారి మరో వంటకంతో తన అభిమానులకు కనువిందు చేసింది ఈ మహిళా కేంద్రమంత్రి.  

తాజాగా తన కూతురు జోయిషీ ఇరానీ తనకు నచ్చిన వంటకాలు చేయమని అడగ్గానే నో అని చెప్పకుండా చేసి పెట్టానని స్మృతీ తెలిపింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేసింది. 

‘ఆజ్‌ కి ఫర్మాయిష్‌..వెజ్‌ హక్కా నూడుల్స్‌, చికెన్‌ మంచూరియా...చూస్తూనే ఉండండంటూ’అవి తయారు చేసిన విధానాన్ని పూసగుచ్చినట్లు ఫోటోలతో సహా పోస్టు చేసింది. దీంతో మీరు మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఆమె అభిమానులు.

 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని