రూ.330 కోట్ల నీరవ్‌ ఆస్తుల జప్తు

తాజా వార్తలు

Published : 09/07/2020 01:54 IST

రూ.330 కోట్ల నీరవ్‌ ఆస్తుల జప్తు

దిల్లీ: బ్యాంకును మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ముంబయి, లండన్‌, యూఏఈలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.330 కోట్లుగా ఈడీ పేర్కొంది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద ఈ ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. నీరవ్‌ మోదీకి చెందిన రూ.2,348 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. ముంబయిలోని వర్లి ప్రాంతంలో ఉన్న సముద్ర మహాల్‌, మహారాష్ట్రలో బీచ్‌ ఒడ్డున ఉన్న విలాసవంతమైన ఫాంహౌస్‌, రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఉన్న విండ్‌ మిల్‌, లండన్‌లో ఓ ఫ్లాట్‌, యూఏఈలో పలు ఫ్లాట్లను తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ఉన్నాయి.

నకిలీ గ్యారెంటీలను చూపి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసగించిన కేసులో నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మోహుల్‌ ఛోక్సీ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. 2018లో వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. మనీలాండరింగ్‌ చట్టం కింద వీరిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నీరవ్ గతేడాది లండన్‌లో అరెస్ట్‌ అవ్వగా.. దేశానికి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మోహుల్‌ ఛోక్సీ అంటిగ్వాలో నివాసం ఉంటున్నారు. అక్కడే పౌరసత్వం పొందారు. దేశానికి తిరిగొచ్చే విషయంలో అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని