కరోనా కలవరం: 60వేలకు చేరువగా కేసులు

తాజా వార్తలు

Updated : 26/03/2021 10:51 IST

కరోనా కలవరం: 60వేలకు చేరువగా కేసులు

257 మంది మృతులు..4లక్షలకు పైగా బాధితులు

దిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. 60వేలకు చేరువగా కొత్త కేసులు..200కుపైగా మరణాలతో కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 11,00,756 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..59,118 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. రోజూవారీ కేసుల విషయంలో గతేడాది అక్టోబర్ మధ్యనాటి పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం కేసులు కోటి 18లక్షల మార్కును దాటగా.. మృతుల సంఖ్య 1,60,949కి చేరిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కొత్త కేసుల మూలంగా రోజురోజుకూ క్రియాశీల కేసులు పెరిగి, నాలుగు లక్షలకు పైబడ్డాయి. ప్రస్తుతం 4,21,066 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 3.55 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,12,64,637 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..ఆ రేటు 95.09శాతానికి పడిపోయింది. నిన్న ఒక్కరోజే 32,987 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనా విజృంభణలో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో తాజాగా 35,952 కొత్త కేసులు వెలుగుచూడగా..111 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.21లక్షల క్రియాశీల కేసులుండగా..ఒక్క మహారాష్ట్రలోనే వాటి సంఖ్య 2,64,001గా ఉంది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 26లక్షలకు పైబడగా.. 22,83,037 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

మరోవైపు, దేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 25న కేంద్రం 23,58,731 టీకా డోసులను పంపిణీ చేసింది. ఇప్పటివరకు 5,55,04,440 మందికి టీకాలు అందించింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని