ఆక్సిజన్‌ స్టాక్‌ ఉంది.. కానీ రవాణానే సమస్య! 

తాజా వార్తలు

Published : 26/04/2021 20:31 IST

ఆక్సిజన్‌ స్టాక్‌ ఉంది.. కానీ రవాణానే సమస్య! 

కేంద్ర హోంశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా ఉద్ధృతి దేశంలో నానాటికీ పెరిగిపోతుండటంతో కొవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్నారు. దిల్లీ, ముంబయి సహా దేశంలోని పలుచోట్ల సకాలంలో ఆక్సిజన్‌ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు కలిచి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆక్సిజన్‌ నిల్వ సరిపడా ఉందని, రవాణాలోనే సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి తెలిపారు. ఆక్సిజన్‌ కోసం ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. రవాణాలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. భారత్‌ విదేశాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను రప్పిస్తోందన్నారు. అయితే, ఆక్సిజన్‌ ట్యాంకర్ల రవాణా ఓ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌ ద్వారా ఆక్సిజన్‌ ట్యాంకర్ల కదలికలను సమీక్షిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి అధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు రవాణా చేయడంలో సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని