
తాజా వార్తలు
పాల్ దినకరన్ నివాసంలో ఐటీ సోదాలు
చెన్నై: తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 200 మంది ఆదాయపన్నుశాఖ అధికారులు తమిళనాడులోని 28 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ మతబోధకుడు పాల్ దినకరన్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కారుణ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, జీస్ కాల్స్ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ శాఖ తెలిపింది.
ఇవీ చదవండి..
రాజు పట్ల చిన్న తప్పిదానికి అంత శిక్షా!
ప్రమాణ స్వీకార విందు.. ఏమున్నాయంటే..
Tags :