స్టెప్పులేస్తూ అవగాహన కల్పిస్తున్న కేరళ పోలీసులు

తాజా వార్తలు

Updated : 30/04/2021 06:04 IST

స్టెప్పులేస్తూ అవగాహన కల్పిస్తున్న కేరళ పోలీసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో బాగా పాపులర్‌ అయిన ‘ఎంజాయి ఎంజామి’ మలయాళ పాటకు కరోనా నిబంధనలు పాటించమని అర్థం వచ్చేలా పేరడీ పాటను తయారు చేశారు. దానికి తగ్గట్టు స్టెప్పులేసి వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

‘‘కొవిడ్‌ వేళ జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ తప్పకుండా ధరించాలి. పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్క్‌ పెట్టుకోవడం కాదు. దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్‌ వెంట తీసుకువెళ్లాలి. కరోనా వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోతాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి వ్యాక్సిన్‌ వస్తోంది. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. అందరం కలిసి కరోనా లేని భవిష్యత్తు కోసం పోరాడదాం’’ అని వీడియో సారాంశం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని