Vaccine: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాక్‌ ఇన్‌ వ్యాక్సినేషన్‌

తాజా వార్తలు

Published : 30/05/2021 01:35 IST

Vaccine: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాక్‌ ఇన్‌ వ్యాక్సినేషన్‌

ముంబయి:  బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలను సవరించింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, పాలిచ్చే తల్లులకు, 45 సంవత్సరాలు పైబడిన వారికి సోమవారం నుంచి బుధవారం వరకూ ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకుండా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి, రెండో డోసులను అందిస్తామని తెలిపింది. కస్తూర్బా, రాజావాడి, కూపర్‌ ఆసుపత్రుల్లో వారంలోని మూడురోజుల్లో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాక్‌ఇన్‌ వ్యాక్సినేషన్‌ను అందిస్తామని పౌర సంఘం తెలిపింది. అందుకోసం విద్యార్థులు వీసాతో పాటు, సంబంధిత యూనివర్సిటీ నుంచి అనుమతి పత్రాలను తీసుకురావాలని తెలిపింది. 45 సంవత్సరాలు పైబడిన వారు, కొవిషీల్డ్‌ లేదా కొవాక్సిన్‌ రెండో మోతాదు కోసం వేచి ఉన్నవారు, పాలిచ్చే తల్లులు.. వారంలోని ఈ మూడురోజుల్లో వాక్‌ఇన్‌ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఉన్న సమాచారం ప్రకారం నగరంలో 7,44,962 మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు మోతాదులు తీసుకున్నారు. అలాగే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న 11 లక్షల మందిలో 8.53 లక్షల మంది మొదటి డోసు తీసుకున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని