NEET: నీట్‌ (యూజీ)-2021 కొత్త తేదీ ఇదే..

తాజా వార్తలు

Updated : 12/07/2021 19:30 IST

NEET: నీట్‌ (యూజీ)-2021 కొత్త తేదీ ఇదే..

దిల్లీ: నీట్‌ (యూజీ) 2021 పరీక్ష తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను తొలుత ఆగస్టు 1 నిర్వహిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ షెడ్యూల్‌లో మళ్లీ మార్పులు చేసింది. తాజాగా, సెప్టెంబర్‌ 12న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం సాయంత్రం ప్రకటించారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు.

భౌతికదూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే, గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్‌లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

తొలుత ఆగస్టు 1న నీట్‌ నిర్వహిస్తామని మార్చిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 11 భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, కరోనా ఉద్ధృతి కారణంగా పలు పరీక్షలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. నీట్‌ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ సెప్టెంబర్‌ 12న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని