కొవిడ్‌ మహమ్మారికి..160మంది వైద్యులు బలి!

తాజా వార్తలు

Published : 02/02/2021 14:42 IST

కొవిడ్‌ మహమ్మారికి..160మంది వైద్యులు బలి!

వందకు పైగా నర్సులు, ఆశావర్కర్లు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారికి దేశవ్యాప్తంగా లక్షన్నరకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వీరిలో కరోనా యోధులుగా ఉన్న వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం, ఇప్పటివరకు దేశంలో 313 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ రాజ్యసభలో వెల్లడించింది.

కరోనా పోరులో ముందువరుసలో ఉన్న వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న విషయం యావత్‌ దేశాన్ని కలచివేసింది. జనవరి 22నాటికి ఉన్న సమాచారం ప్రకారం,  162 మంది వైద్యులు, 107 మంది నర్సులు, 44 మంది ఆశా వర్కర్లు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైద్య శాఖలో కొవిడ్‌ మరణాలపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే ఈ వివరాలు వెల్లడించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నివేదిక ప్రకారం, ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మరణాలను ధ్రువీకరించినట్లు తెలిపారు. వీరికి ఇన్సూరెన్స్‌కు సంబంధించి ప్రధాన్‌మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ(PMGKP)కింద పరిహారం అందుతుందని చెప్పారు.

4నెలల్లో భారీగా తగ్గిన కేసులు..
దేశంలో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ గడిచిన నాలుగు నెలల నుంచి వైరస్‌ ఉద్ధృతి గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే ప్రతిపది లక్షల జనాభాకు చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య అత్యంత తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.94శాతం ఉండగా, 1.44శాతం మరణాల రేటు ఉందన్నారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఐసోలేషన్‌, క్వారైంటైన్‌, చికిత్స వంటి వ్యూహాలతో వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయగలిగినట్లు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ఇవీ చదవండి..
పోలియో చుక్కలకు బదులు..శానిటైజర్‌
చైనా నావికా సిబ్బందిలో మానసిక సమస్యలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని