corona: ఆ పది రాష్ట్రాల్లోనే 76 శాతం కేసులు

తాజా వార్తలు

Published : 21/05/2021 16:49 IST

corona: ఆ పది రాష్ట్రాల్లోనే 76 శాతం కేసులు

దిల్లీ: గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల్లో 76.66 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేశంలో గత ఎనిమిది రోజులుగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్‌ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 3,57,295 కొత్త కేసులు నమోదవ్వగా, పాజిటివిటీ రేటు 12.59కు తగ్గింది. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య  తగ్గుతుండటంతో భారత్‌లో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,27,925గా ఉంది. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,27,12,735కు చేరింది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న పది రాష్ట్రాల్లో తమిళనాడు(35,579) మొదటి స్థానంలో ఉండగా, కేరళ (30,491) తర్వాతి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, అస్సాం ఉన్నాయి. మరోవైపు నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 20,61,683 కరోనా టెస్టులు చేయగా 2,59,551 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 19,18,79,503కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని