Ladakh standoff: గోగ్రా నుంచి బలగాల ఉపసంహరణకు భారత్‌, చైనా ఓకే

తాజా వార్తలు

Published : 03/08/2021 19:42 IST

Ladakh standoff: గోగ్రా నుంచి బలగాల ఉపసంహరణకు భారత్‌, చైనా ఓకే

దిల్లీ: సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునే దిశగా మరో అడుగు పడింది. తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా హైట్స్‌ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు భారత్‌, చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. గత శనివారం రెండు దేశాల మధ్య జరిగిన కమాండర్‌ స్థాయి సైనిక చర్చల్లో ఈ మేరకు ఒప్పందానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

ఎల్‌ఏసీ వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద గత శనివారం ఇరు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ భేటీలో గోగ్రా హైట్స్‌ నుంచి బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారం తెలిపినట్లు సమాచారం. రానున్న మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణపై భారత్‌, చైనా మధ్య ఏకాభిప్రాయం కుదలేదని సమాచారం. 

తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలూ భారీగా సైన్యాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మధ్య పలుమార్లు సైనిక, దౌత్య పరమైన చర్చలు జరిగాయి. వీటికి అనుగుణంగా పాంగాంగ్‌ సరస్సు, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని