విదేశాల నుంచి కొనసాగుతున్న సాయం

తాజా వార్తలు

Updated : 08/05/2021 11:42 IST

విదేశాల నుంచి కొనసాగుతున్న సాయం

వాషింగ్టన్‌: కొవిడ్‌ కేసులతో అల్లాడుతున్న భారత్‌కు పలు దేశాలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు సాయం కొనసాగిస్తున్నాయి. ‘యూఎస్‌ ఎయిడ్‌’ పేరిట అమెరికా 100 మిలియన్‌ డాలర్ల విలువైన సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ 6 విమానాల్లో వైద్య అత్యవసర పరికరాలు, ఔషధాలు, వస్తువులను పంపింది. ‘‘రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా భారత్‌కు సహకారం అందిస్తున్నాం. ఇప్పటివరకూ 1.25 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు... 1,500 ఆక్సిజన్‌ సిలిండర్లు, 550 మొబైల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లు, 25 లక్షల ఎన్‌-95 మాస్కులు, 210 పల్స్‌ ఆక్సీమీటర్లు పంపాం’’ అని ఆ దేశం వెల్లడించింది. నెదర్లాండ్స్, యూఏఈ, స్విడ్జర్లాండ్‌ నుంచి కూడా భారత్‌కు వైద్య పరికరాలు, ఔషధాలు విమానాల్లో వచ్చాయి.

ఐరాస నుంచి 10 వేల కాన్సంట్రేటర్లు

ఐరాస అనుబంధసంస్థలు యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో, యూఎన్‌ఎఫ్‌పీఏలు కలిసి ఇప్పటివరకు 10 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపాయి. కోటికిపైగా మెడికల్‌ మాస్కులను చేరవేశాయి. ఈ విషయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ తెలిపారు. ‘‘వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను భారత్‌కు సమకూర్చుతున్నాం. కరోనా టీకాల నిల్వకు కోల్డ్‌ చైన్‌ పరికరాలను యునిసెఫ్‌ అందిస్తోంది. కరోనా పరీక్షల యంత్రాలు, ఎయిర్‌పోర్ట్‌ థర్మల్‌ స్కానర్లను కూడా పంపుతోంది. టెంట్లు, బెడ్లను డబ్ల్యూహెచ్‌వో అందిస్తోంది. వేలమంది వైద్య నిపుణులను అందుబాటులో ఉంచింది’’ అని డుజరిక్‌ తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని