Joe Biden: కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్న జో బైడెన్

తాజా వార్తలు

Updated : 28/09/2021 23:46 IST

 Joe Biden: కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్న జో బైడెన్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి మూడో డోసును అమెరికా సీడీసీ, ఎఫ్‌డీఏ సిఫారసు చేసిన మరుసటి రోజే ఆయన ఫైజర్ మూడో డోసు తీసుకున్నారు. తన భార్య జిల్ బైడెన్  కూడా బూస్టర్ డోసు తీసుకున్నట్లు బైడెన్  తెలిపారు. టీకా వల్ల తమకు ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా అందరూ కచ్చితంగా టీకా వేసుకోవాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. కాగా అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న వారు బూస్టర్ డోసు తీసుకోవడం చాలా ముఖ్యమని బైడెన్ సూచించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని