WhatsApp: గోప్యతా విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం

తాజా వార్తలు

Published : 09/07/2021 14:00 IST

WhatsApp: గోప్యతా విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం

దిల్లీ హైకోర్టుకు వెల్లడించిన వాట్సాప్‌

దిల్లీ: వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానం (ప్రైవసీ పాలసీ)ను వాట్సాప్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ సంస్థ శుక్రవారం దిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని తెలిపింది.

‘ప్రభుత్వం ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేయమని చెప్పింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు మేం దీన్ని అమలు చేయమని చెప్పాం. దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ స్వచ్ఛందంగా అంగీకరించాం. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తాం’ అంటూ వాట్సాప్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు వెల్లడించారు. అలాగే వాట్సాప్ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేంద్రం భావిస్తోందని తెలిపారు.

వాట్సాప్ కొత్త పాలసీ ఫిబ్రవరిలోనే అమల్లోకి రావాల్సింది. అయితే వివిధ వర్గాల నుంచి వెల్లడైన ఆందోళనల నేపథ్యంలో వాయిదాపడి, మే 15కి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మేలో కేంద్రం రాసిన లేఖపై కొద్ది రోజుల తర్వాత వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. కాగా, కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకువచ్చిన ఐటీ నిబంధనలే కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదానికి దారితీశాయి. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలు పూర్తిగా అమలు చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని, అందుకు తాము సిద్ధంగాలేమని చెప్తూ..వాట్సాప్ కోర్టు మెట్లెక్కింది. ఇది ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని