ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిలిపివేత
close

తాజా వార్తలు

Updated : 13/01/2021 12:30 IST

ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిలిపివేత

కనీసం వారంరోజుల పాటు నిలిపివేస్తామన్న సంస్థ

న్యూయార్క్‌: నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను వారం పాటు నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ట్రంప్ ఛానల్‌లోని ఒక వీడియో హింసను ప్రేరేపిస్తున్నట్లుగా ఉందని యూట్యూబ్‌ దానిని తొలగించింది. ఆ వీడియో వివరాలు వెల్లడించని ఆ సంస్థ ట్రంప్‌ ఛానల్‌కు స్ట్రైక్‌(హెచ్చరిక) ఇచ్చినట్లు తెలిపింది. ఒక వారం తర్వాత ఈ ఛానల్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

యూట్యూబ్‌ మాత్రమే కాకుండా ఫేస్‌బుక్‌ కూడా ట్రంప్‌ ఖాతాను స్తంభింపజేసింది. ట్విటర్‌ అయితే ట్రంప్‌పై నిషేధం విధించింది. ‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో హింసను ప్రేరేపిస్తున్నట్లుగా మేం గమనించాం.  దీంతో స్ట్రైకింగ్‌ నిబంధనలను అనుసరించి వారం రోజుల పాటు ఆ ఛానల్‌లో ఏ విధమైన వీడియోలు అప్‌లోడ్‌ చేయడం గానీ, లైవ్‌ ఇవ్వడం గానీ కుదరదు. ఈ నిబంధనలు వారం తర్వాత పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి’’ అని యూట్యూబ్‌ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్‌ ఛానల్‌లో వ్యాఖ్యలను కూడా డిజేబుల్‌ చేసినట్లు యూట్యూబ్‌ వెల్లడించింది.  కంపెనీ నిబంధనల ప్రకారం రెండోసారి స్ట్రైక్‌ వస్తే ఛానల్‌పై రెండువారాల సస్పెన్షన్‌, మూడు సార్లు స్ట్రైక్‌ వస్తే ఛానల్‌ను పూర్తిగా తొలగిస్తారు.

ఇవీ చదవండి..

అది నిజంగా చైనా టీకానే

దేశంలో క్రియాశీల కేసులు 2.04 శాతం మాత్రమే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని