కాలుష్య ధ్రువీకరణలో.. ఏకరూపత
close

ప్రధానాంశాలు

Updated : 18/06/2021 10:38 IST

కాలుష్య ధ్రువీకరణలో.. ఏకరూపత

ఇకపై దేశమంతటా ఒకే తరహాలో పీయూసీలు  
పరీక్షలో విఫలమైతే వాహన యజమానికి తిరస్కార పత్రం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఇకపై కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు (పీయూసీలు) ఒకే రూపంలో (కామన్‌ ఫార్మాట్‌) ఉండనున్నాయి. ఏకరూప పీయూసీలకు సంబంధించి ‘కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989’ ప్రకారం కేంద్ర రహదారి, రవాణా శాఖ నూతన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నిర్ణీత కాలుష్య విలువలకు మించి పరీక్ష ఫలితాలు వస్తే.. వాహన యజమానికి తిరస్కార పత్రం (రిజెక్షన్‌ స్లిప్‌) ఇచ్చే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు అందులో పేర్కొంది.
తాజా నిబంధనల ప్రకారం..
* కాలుష్య పరీక్షలో వాహనం విఫలమైతే.. తిరస్కార పత్రం జారీ చేస్తారు. దాన్ని చూపించి, కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా వాహనానికి సర్వీసింగ్‌ చేయించుకోవాలి.
* పీయూసీల్లో గోప్యత పాటిస్తారు. వాహన యజమాని మొబైల్‌ నంబర్‌, ఇంజిన్‌, ఛాసిస్‌ నంబర్లలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
* వాహన పరీక్ష సమయంలో యజమాని ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. ఫీజు, వాహన ధ్రువీకరణకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు ఆ నంబర్‌కే వస్తాయి.
* వాహన ఉద్గారాలు నిబంధనలకు లోబడి లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి విశ్వసించినప్పుడు.. సదరు వాహనాన్ని అధీకృత కాలుష్య నియంత్రణ పరిశీలన కేంద్రంలో పరీక్షించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయొచ్చు. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించుకోకపోయినా, సదరు వాహనం కాలుష్య పరీక్షలో విఫలమైనా యజమాని జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
* ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను వాహన యజమాని అమలు చేయకపోతే.. తిరిగి పీయూసీ సమర్పించేంతవరకూ ఆ వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ఇతర అనుమతులను సస్పెండ్‌ చేసే అధికారం ఆర్టీఏకి ఉంటుంది. సస్పెన్షన్‌కు సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలి.
* కాలుష్య నియంత్రణ ధ్రువపత్రంపై క్యూఆర్‌ కోడ్‌ను కచ్చితంగా ముద్రించాలి. అందులో పీయూసీ సెంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన