‘గ్రాండ్‌’గా కొట్టేసింది
close

ప్రధానాంశాలు

Updated : 13/06/2021 05:35 IST

‘గ్రాండ్‌’గా కొట్టేసింది

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్రెజికోవా కైవసం
ఫైనల్లో పవ్లిచెంకోవాపై గెలుపు

పారిస్‌

1

క్రెజికోవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌. 1981 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన తొలి చెక్‌ అమ్మాయి ఈమే.


పెద్దగా అనుభవం లేదు... సీడెడ్‌ కాదు.. ఏనాడూ ప్రిక్వార్టర్స్‌ దాటింది లేదు.. అసలు ఆమె టైటిల్‌ ఫేవరెట్‌ అనిఎవ్వరూ అనుకోలేదు! కానీ బార్బారాక్రెజికోవా అద్భుత ప్రదర్శనతోఅందరినీ ఆశ్చర్యపరిచింది. తనపట్టుదలకు నైపుణ్యాన్ని జోడించినఈ 25 ఏళ్ల చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన తుది సమరంలో అనస్తేసియా పవ్లిచెంకోవా (రష్యా)ను ఓడించి కెరీర్‌లో ఘనంగా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం
చేసుకుంది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 52వ ప్రయత్నంలో తొలిసారి ఫైనల్‌కు వచ్చిన పవ్లిచెంకోవాకు నిరాశ తప్పలేదు.

క్రెజికోవా అదరగొట్టింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ను కైవసం చేసుకుంది.  శనివారం నువ్వానేనా అన్నట్లు సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో 6-1, 2-6, 6-4తో 31వ సీడ్‌ పవ్లిచెంకోవాను ఓడించింది. తొలిసారి ఫైనల్‌ ఆడుతున్న క్రెజికోవా-పవ్లిచెంకోవా హోరాహోరీగా తలపడ్డారు. అయితే తొలి సెట్‌ మాత్రం బార్బారాదే. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఈ చెక్‌ అమ్మాయి.. ప్రత్యర్థికి ఎక్కువగా అవకాశం ఇవ్వలేదు. పదే పదే నెట్‌ వద్దకు దూసుకొస్తూ పాయింట్లు సాధించిన క్రెజికోవా నాలుగు, ఆరు గేముల్లో పవ్లిచెంకోవా సర్వీస్‌ బ్రేక్‌ చేసి తేలిగ్గా తొలి సెట్‌ గెలిచింది. కానీ రెండో సెట్లో పవ్లిచెంకోవా నుంచి ఆమెకు గట్టి ప్రతిఘటన ఎదురైంది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచిన పవ్లిచెంకోవా అదే జోరుతో 6-2తో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది.
ఆఖర్లో పోరాటం: చివరి సెట్లో క్రెజికోవా, పవ్లిచెంకోవా మరింత   దూకుడుగా ఆడారు. ఎవరూ తగ్గకపోవడంతో స్కోర్లు సమం అవుతూ వచ్చాయి. ఒకటి రెండు   అవకాశాలు వచ్చినా ఇద్దరూ బ్రేక్‌ సాధించడంలో విఫలమయ్యారు. కానీ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన బార్బారా 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రెజికోవాకు రెండు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లు వచ్చినా పవ్లిచెంకోవా ఎలాగోలా సర్వీస్‌ నిలబెట్టుకుంది. కానీ పదో గేమ్‌లో టైటిల్‌ కోసం సర్వీస్‌ చేసిన  క్రెజికోవా.. ఆరంభంలో కాస్త తడబడింది. కానీ పుంజుకున్న ఆమె 40-15తో విజయం ముంగిట నిలిచింది. ఆ తర్వాత ఓ షాట్‌ను పవ్లిచెంకోవా కోర్టు బయటకు కొట్టేయడంతో క్రెజికోవా మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన