జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ షురూ

ప్రధానాంశాలు

Published : 16/09/2021 04:05 IST

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ షురూ

వరంగల్‌ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌  హనుమకొండలో బుధవారం ఘనంగా ఆరంభమైంది. తొలి రోజు మూడు ఈవెంట్స్‌లో ఫైనల్స్‌ జరగ్గా.. రైల్వేస్‌ జట్టు రెండు స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్యంతో సత్తా చాటింది. 5 వేల మీటర్ల పరుగు పురుషుల విభాగంలో అభిషేక్‌ పాల్‌, మహిళల విభాగంలో పారుల్‌ చౌదరి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. పోల్‌వాల్ట్‌లో మహిళా విభాగంలో తమిళనాడుకు చెందిన పవిత్ర వెంకటేశ్‌ స్వర్ణం నెగ్గగా, రైల్వేస్‌కు చెందిన మరియా రజతం, కృష్ణరచన్‌ కాంస్యం సాధించారు. మంత్రులు వి.శ్రీనివాస్‌ గౌడ్‌, దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ పోటీలను ఆరంభించగా.. అంజు బాబి జార్జ్‌ ఆరంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన