ఆటోడ్రైవర్‌ కుమార్తెకు మూడు స్వర్ణాలు

ప్రధానాంశాలు

Published : 19/09/2021 00:59 IST

ఆటోడ్రైవర్‌ కుమార్తెకు మూడు స్వర్ణాలు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: హనుమకొండలో జరుగుతున్న జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్ పోటీల్లో తమిళనాడుకు చెందిన ఆర్‌.విత్య రాంరాజ్‌ మూడు బంగారు పతకాలు సాధించింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో, 400 మీటర్ల పరుగులో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. పసిడి సాధించిన 400 మీటర్ల మిక్స్‌డ్‌   రిలేలో ఆమె సభ్యురాలు. నిత్య తండ్రి రాంరాజ్‌ ఆటోడ్రైవర్‌,   తల్లి మీనా గృహిణి. విత్య కవల సోదరి నిత్య కూడా అథ్లెటే.  ఆదివారం జరిగే 10 ఈవెంట్ల ఫైనల్స్‌తో పోటీలు ముగుస్తాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన