బంగ్లాకు షాక్‌

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

బంగ్లాకు షాక్‌

 స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి

టీ20 ప్రపంచకప్‌

అల్‌ అమెరాట్‌: టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్లో సత్తా చాటి సునాయాసంగా ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తుందనుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు గ్రూప్‌-బి తొలి రౌండ్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. ఆదివారం జరిగిన పోరులో స్కాట్లాండ్‌ 6 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. మొదట స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 140 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి ఆ జట్టు ఒక దశలో 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే క్రిస్‌ గ్రీవ్స్‌ (45), జార్జ్‌ మున్సీ (29), మార్క్‌ వ్యాట్‌ (22) రాణించడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేసింది. మెహదీ హసన్‌ (3/19), ముస్తాఫిజుర్‌ (2/32), షకిబ్‌ (2/17) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో బంగ్లా 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే షకిబ్‌ (20), ముష్ఫికర్‌ రహీం (38) కుదురుకోవడంతో బంగ్లా 11 ఓవర్లలో 65/2తో లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ వాళ్లిద్దరూ ఔట్‌ కావడం, తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో ఆ జట్టు లక్ష్యానికి దూరమైంది. మహ్మదుల్లా (23), అఫిఫ్‌ (18) పోరాడినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులే చేయగలిగింది. వీల్‌ (3/24) ఆ జట్టును దెబ్బ తీశాడు. గ్రీవ్స్‌ (2/19) బంతితోనూ రాణించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన